ఉపఎన్నికలు వచ్చే అవకాశాల్లేవు

Drag issue to court, says Jana Reddy - Sakshi

రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం

మీడియాతో ఇష్టాగోష్టిలోసీఎ ల్పీ నేత కె.జానారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి సొంత నియోజకవర్గం లోనే ప్రజలు బీజేపీని ఓడించారన్న విషయా న్ని సీఎం కేసీఆర్‌ గ్రహించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తు తం అసెంబ్లీ నడిచే తీరును చూసి బాధపడుతున్నానన్నారు.

గతంలో అసెంబ్లీ ఎంతో హుం దాగా నడిచేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానేం చేయలేదన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ తానేమీ చేయకపోతే ఆయన తన ఇంటికి ఎందుకొచ్చా రని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్‌ ఏర్పా టు చేసి ఉండకపోతే కేసీఆర్‌ సీఎం హోదాలో మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించారు. తిట్టడం మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ఐడీపీఎల్, ఈసీఐఎల్‌ వంటి సంస్థలనూ కేసీఆరే తీసుకువచ్చారా అని ప్ర శ్నించారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశాలను కొట్టిపారేశారు.  

రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతా
తాను కేసీఆర్‌ లాంటి వాడిని కాదని, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతానని అన్నారు. నాలుగేళ్లపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో వివేచన కనిపించ డం లేదని, అసెంబ్లీలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలో కి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం లో మీడియాపై ఆంక్షలు ఉండబోవన్నారు.

Advertisement
Advertisement
Back to Top