
కాటసాని, డాక్టర్ రామిరెడ్డి, కర్రా
కోవెలకుంట్ల: టీడీపీలో జెండా మోయని వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, నిస్వార్థంతో సేవలందించిన తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని కోవెలకుంట్లకు చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీలో చేరికను పురస్కరించుకుని బుధవారం ఆయన తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్ల పుల్లయ్య, చిన్నబాబు, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశానన్నారు. అధికారంలోకి వచ్చాక పార్టీలో ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా తనను, తన అనుచరులను వేధింపులకు గురిచేశారన్నారు.
అనుచరుల సూచనలతో టీడీపీ సభ్యత్వానికి, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ముఖ్య అనుచరులు గిరిజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్ శ్రీనివాసనాయక్, నాగభూషణంరెడ్డి, నాగేష్, బాలరాజు, వలి, సంజన్న, రఘు, మాలి, చిన్నకొప్పెర్ల, కలుగొట్ల, పెద్దకొప్పెర్ల, వెలగటూరు మాజీ సర్పంచ్‌లు రఘునాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సూర్యశేఖర్‌రెడ్డి, మాధవరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి, ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, మోహన్‌రెడ్డి, గార్లపాటి జగదీశ్వరరెడ్డి, తులసిరెడ్డి, మధుసుధాకర్, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.