బీజేపీ నైతికంగా విజయం సాధించింది: అరుణ

సాక్షి, గద్వాల(మహబూబ్‌నగర్): జిల్లా మున్సిపాలిటీలోని 10 స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని మాజీ మంత్రి డీకే ఆరుణ హర్షం వ్యక్తం చేశారు. గద్వాలోని తన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ: 6 వార్డుల్లో కేవలం 50 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా విజయం సాధించిందని, ఎస్‌ఆర్‌సీ పేరుతో ముస్లిం ఓటర్లను భమభ్రాంతులకు గురి చేసి టీఆర్‌ఎస్ వారి ఓట్లను మళ్ళీంచుకుందని తెలిపారు. కాగా ముస్లిం ఓటర్లు లేని చోట బీజేపీ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టితో గెలిచారని వెల్లడించారు. కేవలం ఎస్‌ఆర్‌సీ పేరుతో టీఆర్‌ఎస్ ముస్లింలను భయపెట్టి బీజేపీకి ఓటు వేయకుండా చేసిందన్నారు.గద్వాల మున్నిపాలిటీలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి