 
													చెన్నై: తమిళనాడులోని రాధాకృష్ణ(ఆర్‌కే)నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ పోటీచేయనున్నారు. డిసెంబర్ 21న జరగనున్న ఎన్నికల్లో దినకరన్ బరిలో నిలుస్తారని ఆయన వర్గంనేత ఎస్ అంబళగన్ చెప్పారు. వీకే శశికళ అంగీకారంతోనే దినకరన్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆయన తెలిపారు.
ఆర్కేనగర్ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ఉప ఎన్నికల్లోనూ దినకరన్ పోటీచేశారు. ప్రచారసమయంలో కోట్లాది రూపాయలు ఓటర్లకు పంచారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ను రద్దుచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
