ఆప్‌ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్‌

Delhi Assembly Election 2020 : AAP Releases Candidates List - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజే.. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చారు. సిట్టింగ్‌ల్లో 15 మందికి టికెట్‌ ఇచ్చేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు. 46 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్‌ కేటాయించారు. కేజ్రీవాల్‌ న్యూఢిలీ​ అసెంబ్లీ స్థానం నుంచి, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 

2015లో 6గురు మహిళలకు టికెట్‌ కేటాయించిన ఆప్‌.. ఈ సారి 8 మందికి అవకాశం కల్పించింది. పోలింగ్‌ కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. దేశ రాజధానిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. 

ఆప్‌ అభ్యర్థులు వీరే..Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top