మోదీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు

Dattatreya comments on Chandrababu - Sakshi

2014లో గెలుపుకోసం తాపత్రయపడ్డారు: దత్తాత్రేయ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిరోజూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. విమర్శలు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇటీవల మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడుతూ 2004లో మోదీని వ్యతిరేకించానని, ఆయన్ని తొలగించాలని వాజ్‌పేయికి చెప్పానని పేర్కొన్నారని, మరి 2014లో ఎందుకు మోదీ కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం పదవి కోసం, 2014లో గెలుపుకోసం తాపత్రయ పడ్డారని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నా రు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు, అప్పటి గవర్నర్‌తో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సీఎం అయిన చంద్రబాబు, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన కాంగ్రెస్‌తో ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తానంటూ చంద్రబాబు బయలుదేరారని విమర్శించా రు. మోదీపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను దత్తాత్రేయ ఖండించారు. రాహుల్‌కు రాజకీయ పరిపక్వత రాలేదని, ఆర్థికపరమైన అవగాహన కూడా లేదన్నా రు. జీఎస్టీలో పన్ను శాతం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దత్తాత్రేయ స్వాగతించారు. రఫేల్‌లో ఎలాంటి అవినీతి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా కాంగ్రెస్‌ నేతలు దాని గురించి మాట్లాడటం సరికాదన్నారు.  

ఫిరాయింపులతో అవమానపరుస్తున్నారు..
టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అప్రజాస్వామికమని దత్తాత్రే య పేర్కొన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్‌ ప్రజలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. 88 స్థానాలతో ప్రజ లు పూర్తి మెజారిటీ ఇచ్చినా కూడా సభలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి న శాసన మండలి చైర్మన్‌ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోందన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఒప్పుకుందని, 362 కి.మీ రీజినల్‌ రింగు రోడ్డుకు ఆమోదం తెలిపిం దన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికైనా కేంద్రాన్ని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. 54 లక్షల మంది రైతుల్లో ఇంకా 9.5 లక్షల మందికి రైతుబంధు అందలేదన్నారు. ఇంకా 5 లక్షల మందికి పాస్‌ బుక్‌లే ఇవ్వలేదని  విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top