చంద్రబాబు శంకరగిరి మాన్యాలకే.. | CPI narayana warns Chandra babu on budget issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు శంకరగిరి మాన్యాలకే..

Feb 4 2018 7:19 PM | Updated on Feb 4 2018 7:49 PM

CPI  narayana warns Chandra babu on budget issue - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తమతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని, దాగుడుమూతలు ఆడితే శంకరగిరి మాన్యాలకే పరిమితం అవుతారని సీపీఐ నేత నారాయణ అన్నారు. చంద్రబాబు లోపలో మాట ఉంచుకుని, ఎంపీలతో మరో మాట చెబుతూ ఆటలాడుతున్నారని విమర్శించారు. ఎంపీలతో ఆట కంటే స్వయంగా ముఖ్యమంత్రే కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా టీడీపీ కేంద్రంపై తమ పంథా మార్చుకుని సీపీఐ పోరాటానికి మద్ధతు తెలపాలన్నారు.

మరోవైపు ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, గత నాలుగేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. కేంద్రం తీరుగా నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని, ఇతర పార్టీలు మద్ధతు తెలిపి బంద్‌ను విజయవంతం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ప్రజలు, వ్యాపారులు, మేధావులతో పాటు టీడీపీ నాయకులూ బంద్‌లో పాల్గొనాలని సీపీఐ నేతలు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement