అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌: ఎవరూ వ్యతిరేకం కాదు కానీ..!

CPI Narayana Comment On Ten Percentage Reservation To EBC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఈ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు.. కానీ సమగ్ర చర్చ జరిగే సమయం లేకుండా సభలో బిల్లును ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడంతో జనరల్‌ కేటగిరిలో తమకి స్థానం దక్కదని వేరే వాళ్లు అనుకుంటే ఇబ్బంధులు తలెత్తుతాయని హెచ్చరించారు.

ఎన్నికల ముందు అగ్రకులాల పేదలకు తాయిలాలు ఇచ్చేలా కేంద్రం దీన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. సీబీఐ కేసులో సుప్రీం తీర్పు ప్రధాని మోదీ, సీవీసీ చౌదరికి చెంపపెట్టు అని అన్నారు. స్వతంత్ర సంస్థల్లో కేంద్రం జోక్యం మానుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. మోదీ నిరంకుశ పాలనకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top