చట్టం అమలులో కేంద్రం విఫలం: పొంగులేటి

Congress Leader Ponguleti Sudhakar Reddy Slams Both State And Central Governments In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం
ప్రాజెక్టుతో తెలంగాణాకు నష్టం లేదని చంద్రబాబు అన్న మాటల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు.  కాంగ్రెస్‌ నాయకులు ఎన్నడూ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు ముంచిన మండలాలు చాలని, ఇంకా ముంచవద్దని మాత్రమే అడుగుతున్నట్లు తెలిపారు. భద్రాద్రి రామాలయం ముంపునకు గురవకుండా కాపాడుకోవాలని వ్యాక్యానించారు.

 పోలవరం కోసం అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ దగ్గరకు కేసీఆర్‌ తీసుకెళ్తానని అన్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ కేసీఆర్‌ తీసుకెళ్లలేదని విమర్శించారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ లెవెల్స్‌..వరద అంచనాలను పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ వేయటానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి తీరిక లేకపోవడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా నోరు విప్పాలని, ప్రాజెక్టు రీడిజైన్‌ కోసం కేసీఆర్‌ డిమాండ్‌ చేయాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top