'ఇవాంకకు లేఖ రాశా' | congress leader hanumantha rao slams KCr over GES | Sakshi
Sakshi News home page

'ఇవాంకకు లేఖ రాశా'

Dec 1 2017 2:16 PM | Updated on Dec 1 2017 2:31 PM

 congress leader hanumantha rao slams KCr over GES - Sakshi

ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్‌ షో గా నడిచిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్‌ షో గా నడిచిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంక కు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు.  వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement