‘నాయకత్వాన్ని మార్చాలని కోరుతున్నా’

Congress High Command Should Change Leadership In Telangana Said By Congress MLA Komatireddy Rajagopal Reddy - Sakshi

హైదరాబాద్‌: బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని అడిగినట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రాజగోపాల్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చెప్పా..ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి వరకు అభ్యర్థులనే ప్రకటించక పోవడం వల్ల చాలా నష్టం జరిగిందని వాపోయారు. మాలాంటి వాళ్లకు కూడా ఆఖరి వరకు కూడా టిక్కెట్లు ఇవ్వలేదని తెలిపారు.

పార్లమెంటు ఎన్నికలలో కనీసం 8 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వ మార్పు అవసరమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్తుంటే జోష్‌ రావడం లేదని వ్యాక్యానించారు. నాయకత్వాన్ని మార్చాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరుతున్నట్లు చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top