గుజరాత్‌ ఎన్నికలు: తాజా పోల్‌లో యూటర్న్‌ | Congress, BJP neck and neck in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఎన్నికలు: లోక్‌నీతి-సీడీఎస్‌ పోల్‌ యూటర్న్‌

Dec 5 2017 10:36 AM | Updated on Aug 21 2018 2:39 PM

Congress, BJP neck and neck in Gujarat - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇరు పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు అద్దం పడుతున్నాయి. పలు సర్వేలు బీజేపీకి విజయం కట్టబెడుతున్నా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని, ఇరు పార్టీలకు 43 శాతం ఓట్లు పోలవుతాయని తాజాగా లోక్‌నీతి-సీడీఎస్‌ పోల్‌ పేర్కొంది. అయితే 182 మంది సభ్యులు కల గుజరాత్‌ అసెంబ్లీలో బీజేపీకి 91 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

కాంగ్రెస్‌కు 78 నుంచి 86 స్ధానాలు దక్కవచ్చని పేర్కొంది.  ఆగస్టులో ఇదే పోల్‌ ఏజెన్సీ చేసిన సర్వేలో బీజేపీ సులభంగా 150 మార్క్‌ను దాటుతుంటని, కాంగ్రెస్‌కు కేవలం 30 సీట్లు దక్కుతాయని తేల్చింది. హార్థిక్‌ పటేల్‌, ఇతర యువ నేతల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.

మరోవైపు జీఎస్‌టీపై వ్యాపార వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఏబీపీ న్యూస్‌ కోసం లోక్‌నీతి-సీడీఎస్‌ నిర్వహించిన ఈ పోల్‌ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement