కాంగ్రెస్‌కు‘శక్తి’ | Congress Begins Operation Social Media | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు‘శక్తి’

Jun 8 2018 12:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Begins Operation Social Media  - Sakshi

పార్టీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

సాక్షి, రంగారెడ్డి : పార్టీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నసామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని మరింత ప్రజల దరికి చేర్చాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో సంస్థాగత కార్యక్రమాలేగాకుం డా సమకాలీన రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని ఏఐసీసీ భావిస్తోంది.

ఈ క్రమంలోనే గురువారం ‘శక్తి’ యాప్‌పై పార్టీ నేతలకు జాతీయ కోఆర్డినేటర్‌ యశ్వంత్‌ శుక్లా, పార్టీ ప్రతినిధులు స్వప్న, ఆశోక్‌ వర్గీస్‌ గాంధీభవన్‌లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్,  పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, పార్టీ నేతలు నందికంటి శ్రీధర్, రవికుమార్‌యాదవ్‌  పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement