సీఎం.. చింపాంజి | cm siddaramaiah pics shared in whatsapp group | Sakshi
Sakshi News home page

సీఎం.. చింపాంజి

Jan 11 2018 8:09 AM | Updated on Jan 11 2018 8:09 AM

cm siddaramaiah pics shared in whatsapp group - Sakshi

హుబ్లి (సాక్షి, బెంగళూరు): సీఎం సిద్ధరామయ్యను చింపాంజితో పోలుస్తూ హుబ్లి–ధారవాడ మహిళా కాంగ్రెస్‌ వాట్సప్‌ గ్రూప్‌ లో స్థానిక కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ మోహన హిరేమని షేర్‌ చేసిన మార్ఫింగ్‌ చేసిన ఫో టో చర్చనీయాంశమైంది. ఏకంగా సీఎం ఫోటోను అదే పార్టీ నాయకురాలు పార్టీ గ్రూప్‌లోనే పోస్ట్‌ చేయడంతో ఆమెపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు డీ.కే.శివకుమార్, వినయ్‌ కులకర్ణి, కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ తదితరులు సభ్యులుగా ఉన్న గ్రూపులో ఈ ఫోటో పెట్టడం విశేషం. దీనిపై హుబ్లి–ధారవాడ నగర జిల్లాధ్యక్షుడు అల్తాఫ్‌ స్పందిస్తూ  కార్పొరేటర్‌ మోహన హిరేమని తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మేం పెట్టలేదు : తమ నాయకుడైన సిద్ధరా మయ్య అవహేళనకరంగా ఉన్న ఫోటోను తాము పోస్ట్‌ చేయలేదని, ఈ ఘటనతో త మకు సంబంధం లేదని కార్పొరేటర్‌ మోహన హిరేమని చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement