సీఎం మార్పు తప్పదా? | DK Shivakumar vs siddaramaiah power struggle karnataka congress | Sakshi
Sakshi News home page

సీఎం మార్పు తప్పదా?

Apr 19 2026 9:22 AM | Updated on Apr 19 2026 11:33 AM

DK Shivakumar vs siddaramaiah power struggle karnataka congress

సాక్షి బెంగళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతుండడం తెలిసిందే. సీఎం సిద్ధరామయ్యతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న నేతలను డీకే శివకుమార్‌ వర్గీయులు  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పారీ్టలో ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీకే శివకుమార్‌ బాహాటంగా హెచ్చరించడంతో పాటు ఇటీవల కాలంలో కొందరిపై పడిన వేటును గుర్తు చేసుకుని సీఎం వర్గీయుల్లో భయం అలుముకుంది. సీఎం అనుచరులు వరుసగా పదవులను కోల్పోతున్నారు. దీంతో  సిద్దు కుర్చీ కూడా డోలాయమానంలో పడిందని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.  

5 రాష్ట్రాల ఎన్నికల తరువాత 
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ విధానసభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక రాజకీయాలపై హైకమాండ్‌ నాయకులు దృష్టి సారించనున్నారు. మే 20తో సిద్ధరామయ్య సీఎం అయ్యి మూడేళ్లు పూర్తి అవుతుంది. అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా సిద్ధరామయ్య రికార్డు కెక్కారు. సిద్ధరామయ్య పదవిని వదులుకోవాల్సి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైకమాండ్‌ నేతలను డీకే శికుమార్‌ ఒప్పించారని, జూన్‌ నాటికి  కుర్చీ మారి్పడి తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement