తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది ఈ జన్మభూమే

CM KCR speech at siddipeta meeting - Sakshi

సాక్షి, కొండపాక (సిద్దిపేట జిల్లా): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్సానపల్లిలో మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొండపాకలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగించారు.

'నాకు జన్మనిచ్చింది సిద్దిపేట.. రాజకీయ జన్మను కూడా ఇచ్చింది సిద్దిపేటనే. అనర్గళంగా మాట్లాడే గళం ఇచ్చింది..పోరాడే బలం ఇచ్చింది సిద్దిపేటే.. పలుకులు ఇచ్చి పదవులు ఇచ్చింది.. తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది సిద్దిపేటనే.. ఎల్లవేళల అండనిచ్చిన నా జన్మభూమి సిద్దిపేటకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా' అని కేసీఆర్‌ అన్నారు.
 
'చాలా సంతోషంగా ఉంది.. సిద్దిపేటలోనే భోజనం చేసి సిరిసిల్లకు పోమ్మని హరీష్‌ చెప్పిండు.. కానీ మిమ్మలందరినీ చూడగానే కడుపు నిండిపోయింది. భోజనం చేయాలన్న ఇంట్రెస్ట్‌ కూడా పోయింది' అని చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • సిద్దిపేట జిల్లా కావాలన్నది నా చిన్ననాటి ఆకాంక్ష
  • సిద్దిపేట జిల్లా కావాలని గతంలోనే అప్పటి సీఎం ఎన్టీఆర్‌ను కోరాం
  • 21.4శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దూసుకెళ్తోంది
  • ఎన్నో కష్టాలకు ఓర్చి 24 గంటలపాటు విద్యుత్‌ ఇస్తున్నాం
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top