చంద్రబాబు ఎప్పడూ ఒంటరిగా గెలవలేదు: బీజేపీ

CM ChandraBabu Does Not Win In Elections As Single - Sakshi

సాక్షి, నెల్లూరు: అవసరానికి తగ్గట్లుగా మాట మార్చడం చంద్రబాబు నాయుడికే చెల్లిందని ఇటీవల విమర్శించిన బీజేపీ నేత సురేష్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం తీరును బట్టబయలుచేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని అన్నారు. గతంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వల్లే చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారని అభిప్రాయపడ్డారు.

ఏపీ మంత్రి నారాయణ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాల్లోనూ అవినీతి జరుగుతుందన్నారు. టీడీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చుతున్నారని బీజేపీ నేత సురేష్ రెడ్డి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెబుతున్నవన్నీ వాస్తవాలనేనని బీజేపీ నేత సురేష్ రెడ్డి చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top