మంత్రి బెదిరింపులు.. సీఎం హెచ్చరికలు

Chief Minister Yogi Adityanath Summoned Minister Swati Singh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కేబినెట్‌ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతిసింగ్‌పై ఇటీవల బెదిరింపు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ పోలీస్‌ అధికారిపై ఆమె ఫోన్‌లో బెదిరిస్తున్న ఆడియో రికార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వాతిసింగ్‌పై  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఆరా తీసిన సీఎం యోగి.. సదరు మంత్రికి నోటీసులు పంపారు. ఫోన్‌కాల్‌ రికార్డుపై 24 గంటల్లో సీఎం కార్యాలయానికి, డీజీపీకి వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే అధికారులతో హుందాగా వ్యహరించాలని కూడా హెచ్చరించినట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top