రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దీక్షలు | Chief Minister Chandrababu Prayed For Political Gain | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దీక్షలు

Apr 21 2018 8:27 AM | Updated on Aug 14 2018 11:24 AM

Chief Minister Chandrababu Prayed For Political Gain - Sakshi

మాట్లాడుతున్న ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి  శ్రీరాములు గౌడ్‌

కోడుమూరు రూరల్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్ష కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్, ఎమ్మార్పీఎస్‌ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనంటూ దీక్షలు చేసిన వారందరిపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ ప్రభుత్వం నేడు హోదా ఇవ్వాలంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఎమ్మార్పీఎస్‌ నాయకులు నాగేష్, మహేష్‌నాయుడు, మధు, సురేంద్ర, లక్ష్మన్న, రవి, రాజు, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement