‘చంద్రబాబు ఓ సైకో ఫ్లవర్‌, ముట్టుకుంటే విషమే’ | Chandrababu is a Psycho Flower, says tammineni sitaram | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓ సైకో ఫ్లవర్‌: తమ్మినేని

Nov 24 2017 1:33 PM | Updated on Nov 24 2017 1:37 PM

Chandrababu is a Psycho Flower, says tammineni sitaram - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ చంద్రబాబు ఓ సైకో ఫ్లవర్‌, సైకో ఫ్లవర్‌ను ముట్టుకుంటే విషం చిమ్ముతుంది. ఆయన వద్దకు చేరినా అంతే....చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే. నీతివంతమైన, ప్రజాస్వామ్య రాజకీయాలు ఎప్పుడైనా చేశారా?.

ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి, పార్టీలో చేర్చుకోవడం వైఎస్‌ జగన్‌ నీతి అయితే,... ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుక్కొని వారిని కేబినెట్‌లోకి చేర్చుకోవడం చంద్రబాబు నైజం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. గత చరిత్రను గుర‍్తించి నీతి కోసం మాట్లాడాలి. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, మళ్లీ అదే ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. ఇక తన రాజకీయ గురువైన అమర్నాథ్‌రెడ్డిని మోసం చేసి, ఆయన కొడుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డిని పొగడటం ఏమీ రాజకీయం. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో నల్లారి సోదరుల పాత్ర ఉందని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు వారినే పార్టీలో చేర్చుకున్నారంటే ...ఆయన నీతి ఏపాటిదో అర్థం అవుతోంది. 2019లో చంద్రబాబుకు కటకటాలు తప్పవు. జగన్‌ ప్రభంజనాన్ని చంద్రబాబు అడ్డుకోలేరు.’  అని  అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement