దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి! | Chandrababu Naidu ran up a bill of RS 8.7 Lakhs | Sakshi
Sakshi News home page

దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి!

Aug 9 2018 2:04 PM | Updated on Aug 9 2018 9:28 PM

Chandrababu Naidu ran up a bill of RS 8.7 Lakhs - Sakshi

విదేశీ పర్యటనల పేరుతో ఇప్పటికే ప్రజా ధనాన్ని మంచి నీళ్లలా దుర్వినియోగం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

బెంగళూరు: విదేశీ పర్యటనల పేరుతో ఇప్పటికే ప్రజా ధనాన్ని మంచి నీళ్లలా దుర్వినియోగం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్వదేశంలో తన లగ్జరీ కోసం చేస్తున్న ఖర్చు కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబుకు అయిన హోటల్‌ బిల్లు ఎంతో తెలుసా అక్షరాలా రూ. 8.7 లక్షలట. అయితే ఆ మొత్తాన్ని సిగ్గు-ఎగ్గు లేకుండా ప్రభుత్వమే చెల్లించడం ఇక్కడ గమనార్హం.

ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలు తమ హోటల్‌ ఖర‍్చును లక్ష, రెండు లక్షల మధ్యలో ముగించేస్తే, మన ‘డాబు’గారు.. ఏమాత్రం సిగ్గు పడకుండా రూ. 8లక్షలకు పైగా ఖర‍్చు చేశారట. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన నేతలకు అయిన ఖర‍్చుపై బెంగళూర్‌ మిర్రర్‌ ఓ కథనాన్ని ప్రచురించడంతో బాబు గారి దుబారా బయటపడింది. ఎంతైనా ఖర్చుకు అలవాటు పడ్డ ప్రాణం కదా.. ఆ మాత్రం దుబారా లేకపోతే ఎలా? అని చర్చించుకోవడం ప్రజల వంతైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement