ఇందిరమ్మ ఇళ్లకు సీఎం ఎసరు: చాడ | Chada Venkat Reddy Fires On CM KCR about Indiramma houses | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు సీఎం ఎసరు: చాడ

Aug 18 2018 3:17 AM | Updated on Aug 18 2018 3:17 AM

Chada Venkat Reddy Fires On CM KCR about Indiramma houses - Sakshi

చిగురుమామిడి (హుస్నాబాద్‌): కేసీఆర్‌ ఇందిరమ్మ ఇళ్లకు ఎసరుపెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా 4.66 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం రామంచలో విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం.. సీబీసీఐడీతో విచారణ జరిపించి ఎందుకు మరుగున పెట్టిందని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ఎక్కడా నిర్మించడం లేదన్నారు. రామచంద్రం, హుస్నాబాద్‌ ఎమ్మె ల్యే వొడితెల సతీష్‌కుమార్‌ పదినెలల క్రితం డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారని, ఇంకా ప్రారంభంకాలేదని పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement