
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగం ఆయుష్ వైద్యులతో మంత్రి కె.తారకరామారావు ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్రంగా పరిగణించింది. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కేటీఆర్‌ను బుధవారం ఆదేశించింది. గతనెల 7న హైదరాబాద్‌లోని బోల్‌క్లబ్‌లో ‘ఆయుష్ డాక్టర్స్ విత్ కేటీఆర్’పేరుతో సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆయుష్ వైద్యులకు పలు హామీలిచ్చారు. ఈ ఘటనపై కొందరు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈసీ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఇది అధికారిక సమావేశం కాదని, ప్రైవేటు సమావేశమని వారు నివేదికలో పేర్కొన్నారు. దీనిపై సీఈసీ స్పందిస్తూ.. ప్రభుత్వ వైద్యులతో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది.