‘ప్రాణాలు అర్పించైనా రాహుల్‌ను ప్రధాని చేస్తాం’ | Byreddy Rajasekhar Reddy Says Rahul Will Become PM | Sakshi
Sakshi News home page

Jan 30 2019 12:33 PM | Updated on Mar 18 2019 9:02 PM

Byreddy Rajasekhar Reddy Says Rahul Will Become PM - Sakshi

(ఫైల్‌ ఫోటో)

ఇతర పార్టీల నాయకుల్ని లాక్కోవడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య

సాక్షి, కర్నూలు : ప్రాణాలు అర్పించైనా తమ అధినేత రాహుల్‌ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్‌ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌, ప్రియాంక గాంధీలను త్వరలోనే కర్నూలుకు తీసుకువస్తామన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌ను వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీల నాయకుల్ని లాక్కోవడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. జిల్లాలో రెండు పార్లమెంట్‌, 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో  కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఆయన తన దూకుడును పెంచినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement