పోలీసులపై బొండా ఉమా దౌర్జన్యం | Bonda Uma Misbehaviour With Police | Sakshi
Sakshi News home page

పోలీసులపై బొండా ఉమా దౌర్జన్యం

Jan 7 2020 6:05 PM | Updated on Jan 7 2020 6:23 PM

Bonda Uma Misbehaviour With Police - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ నేత బొండా ఉమా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. పోలీసులను అరే, ఒరే అంటూ తీవ్ర పదజాలంతో దూపించారు. నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ నోరు పారేసుకున్నారు. అంతటితో ఆగకుండా.. నోరు మూసుకో అంటూ వేలు చూపించారు. చొక్కాలు విప్పదీయడం కూడా తనకు తెలుసునని హెచ్చరించారు.  అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పోలీసులతో ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement