రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం: జీవీఎల్‌

BJP MP GVL Comments Dissolution of AP Legislative Council - Sakshi

రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం: జీవీఎల్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top