ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి: వివేక్‌

BJP Leader Vivek Fires On KCR Over Yadadri Temple Issue - Sakshi

సాక్షి, యాదాద్రి: పవిత్ర యాదాద్రి ఆలయంలో కేసీఆర్‌ బొమ్మతో పాటు ఇతర రాజకీయ బొమ్మలు చెక్కడంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ మండి పడ్డారు. ఈ చర్యలు కేసీఆర్‌ నియంత పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కొత్తగా నిర్మించే అన్ని నిర్మాణాలపై తన పేరు, బొమ్మ ఉండాలనే పిచ్చి బాగా ముదిరిందని విమర్శించారు. అందుకే సెక్రటేరియట్‌ను కూడా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చివరకు దేవుడి గుడిని కూడా వదల్లేదన్నారు. స్థంభాలపై చెక్కిన వివాదాస్పద బొమ్మలను తొలగిస్తే సరిపోదు.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేసీఆర్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలా జరగని పక్షంలో బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివేక్‌ హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top