
బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులపై చర్యలు ఏకపక్ష నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులపై చర్యలు ఏకపక్ష నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సభలో చర్చించకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత జానారెడ్డి కుర్చీలో నుంచి లేవకపోయినా సస్పెండ్ చేయడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.