బాబు మానసికస్థితి బాలేదు.. బట్టలిప్పి తిరిగినా..!!

BJP AP Chief Kanna Laxminarayana Fires on CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని, త్వరలోనే ఆయన బట్టలూడదీసుకోని రోడ్డుపై తిరిగినా ఆశ్చర్యం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే ఆయన నేడు జతకట్టారని మండిపడ్డారు. గురువారం గుంటూరులో కన్నా విలేకరులతో మాట్లాడాతూ.. ‘టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘రాష్ట్రానికి చంద్రబాబు సైంధవుడు. రాష్ట్ర విభజన సమయంలోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లుగా ఉంది’ అని విమర్శించారు.
రాష్ట్ర ప్రజల సోమ్ముతో పోలవరం విహార యాత్రలా? అని కన్నా ప్రశ్నించారు.

కేంద్రం సోమ్ముతో ప్రాజెక్టు కడుతూ.. చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. రాయలసీమలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో మంత్రి పరిటాల సునీతా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని తాను చాలెంజ్ చేసి చెబుతానని, రాయలసీమ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. రాజధాని పేరుతో  వ్యాపారం చేసుకోవడం తప్ప టీడీపీ చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు దొంగ మాటలకు సీఎస్ దినేశ్‌కుమార్ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. విభజన హామీల విషయంలో మన్మోహన్‌సింగ్‌, మోదీల ప్రసంగం మార్ఫింగ్ చేసి టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరిస్తామని కన్నా తెలిపారు.

పగటి కలలు కంటూ వార్త రాశారు
వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయమై బీజేపీని ఉద్దేశించి ఓ పత్రికలో​ ప్రచురితమైన కథనాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఆ పత్రిక ఎండీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఆధారాలు లేకుండా అసత్యాలతో, ఊహగానాలతో కూడిన ఆ కథనాన్ని ఖండిస్తున్నాను. ఆ కథనం పగటికలలు కంటూ రాసినట్టుగా ఉంది. ఈ కథనానికి సంబంధించి తప్పు బప్పుకుంటారని ఆశిస్తున్నాన’ని అందులో పేర్కొన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top