అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు! | Bhuma Akhila Priya Slams Narendra Modi Government | Sakshi
Sakshi News home page

అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు!

Jun 2 2018 2:34 PM | Updated on Aug 15 2018 2:40 PM

Bhuma Akhila Priya Slams Narendra Modi Government - Sakshi

సాక్షి, కర్నూలు : ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై టీడీపీ నాయకురాలు, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో మహిళలు రోడ్లపైకి రావాలంటే చాలా భయపడుతున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న అఖిలప్రియ మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ కనపిస్తే అక్కడ వారిపై దాడి చేయాలని, అత్యాచారాలు చేయాలని నేతలు రెచ్చగొట్టి పంపిస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేస్తున్న రోజే కేంద్రంలోని మోదీ సర్కార్‌పై అఖిలప్రియ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గత కొంతకాలం నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు, కాంగ్రెస్‌తో దోస్తీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో ఏపీలో ఎంతో మంది మైనర్లు అత్యాచారాలకు గురవుతున్నా టీడీపీ సర్కార్‌ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement