మంగళగిరిపై బెట్టింగ్‌ రాయుళ్ల గురి..!

Betting on Political Parties in Lok Sabha Election - Sakshi

లోకేశ్‌పైనే ప్రధాన చర్చ..

గెలిస్తే ఒకటికి రెండు ఇస్తామంటూ పందేలు

ఆర్కే గెలిస్తే మంత్రిని చేస్తానని జగన్‌ హామీ

ఫలితంగా ఆర్కే వైపే పందేలు కాస్తున్న యువత

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మొదటి దశలోనే ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది. అయితే ఎన్నికల్లో ఏయే స్థానాల్లో ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలుస్తారు.? ఎవరు ఓడతారు.? ఓడితే ఎంత మెజార్టీతో ఓడతారు.? ఇలా బెట్టింగ్‌ రాయుళ్ల పెందెలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్‌ రాయుళ్ల ఫోకస్‌ అంతా మంగళగిరిపైనే ఉంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పోటీచేస్తుండడం... ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశాలపై బెట్టింగ్‌ జోరుగా సాగుతున్నాయి.

వైఎస్సార్‌ సీపీపైనే బెట్టింగ్‌ రాయుళ్ల చూపు..
నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లున్నాయి. ఇక్కడ 85 శాతం పోలింగ్‌ నమోద అయింది. క్షేత్ర స్థాయిలో ఓటర్‌ పల్స్‌ని పసిగట్టిన పంటర్లు మాత్రం వైఎస్సార్‌ సీపీపైనే పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. లోకేశ్‌ గెలుస్తాడు అని బెట్టింగ్‌ వేసే వారికి ఒకటికి 1.5 నుంచి రెండు రెట్లు ఇస్తామంటున్నారు. (ఉదాహరణకు లోకేశ్‌ వైపు రూ.లక్ష పందెం కాస్తే లక్షా యాభైవేల నుంచి రెండు లక్షలు ఇచ్చే అవకాశం ఉంది). భారీగా పోలింగ్‌ నమోదవడంతో పాటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీలు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు.

లోకేశ్‌ను దెబ్బతీసిన ద్వితీయ శ్రేణి నాయకులు..
స్వయంగా సీఎం తనయుడు, టీడీపీ భవిష్యత్‌ నాయకుడిగా భావించే లోకేశ్‌ బరిలో ఉండడంతో సాధారణంగానే ఆ పార్టీ ఇక్కడ గెలుపుపై తీవ్ర కసరత్తు చేసింది. అయితే ఎలక్షన్‌ ముందు రోజు చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు లోకేశ్‌కు హ్యాండ్‌ ఇచ్చారు. డబ్బులు అందగానే వారి ‘దారి’ వారు చూసుకున్నారు. దీనికి తోడు లోకేశ్‌ గెలిస్తే తాడేపల్లి మండలంలో కొండలపై ఉన్న వారి ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. వీరంతా గంపగుత్తగా ఆర్కేకు వైపు మొగ్గు చూపినట్లు తెలసుస్తోంది. అలాగే భూ సేకరణ వల్ల ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన రైతులు, ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు... చేనేతలు ఇలా అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్కే గెలిస్తే మంత్రి పదవి..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించడంతో అప్పటిదాకా ఉన్న సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆర్కే మంత్రిగా ఉంటే తమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తటస్త ఓటర్లు భావించారు. దీంతో అన్ని వర్గాల ఓటర్లతో స్పష్టంగా ఆర్కేను గెలిపించుకుందామనే భావన వ్యక్తమవడంతో లోకేశ్‌ ఓడిపోతారనే ప్రచారం జోరుగాసాగుతోంది.

ఎన్నికలకు వారంముందు వరకు..
ఎన్నికలకు వారం ముందు వరకు నియోజకవర్గంలో ఓటరు నాడి అంతుపట్టకుండా ఉంది.  బలాబలాలు సమానంగా కనిపించాయి. అయితే చివరిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం, ఆర్కేకు మంత్రి పదవి హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి బలం చేకూరింది. దీంతోనే పంటర్లు ఆర్కేపైనే పందెం కాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి పోలింగ్‌ రోజు లోకేశ్‌ నానా హంగామా చేయడంతో బెట్టింగ్‌ రాయుళ్లు అతడి గెలుపుపైఅంచనాకు వచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు

18-04-2019
Apr 18, 2019, 06:38 IST
పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని ...
18-04-2019
Apr 18, 2019, 05:42 IST
కేరళలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రసంగం అనువాదంలో అపశృతులు దొర్లాయి. రాహుల్‌ గాంధీ ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని మలయాళంలోకి అనువదించడంలో పార్టీ...
18-04-2019
Apr 18, 2019, 05:32 IST
డేట్‌లైన్‌ – బెంగళూరు దేశ ప్రధాని నరేంద్రమోదీ గత రెండు నెలల్లో కర్ణాటకకు ఎన్నిసార్లు వచ్చారో తెలుసా? కొంచెం అటుఇటుగా వారానికి...
18-04-2019
Apr 18, 2019, 05:11 IST
నాది 56 అంగుళాల ఛాతీ. నాకున్న దమ్ముతో దేశాన్ని నిలబెడతా అంటూ ప్రచారం చేసుకోవడమా?.. చాయ్‌వాలా కూడా ప్రధాని కాగల...
18-04-2019
Apr 18, 2019, 05:01 IST
నిజమేనండీ.. గుర్‌గావ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈ చౌకీదార్‌ పోటీ చేస్తున్నారు. అదేంటీ.. ఈ దేశపు చౌకీదార్‌ మోదీ వారణాసి...
18-04-2019
Apr 18, 2019, 04:47 IST
రాజధాని ఢిల్లీలో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌.. అరవింద్‌ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్‌ మ«ధ్య నాటకీయ పరిణామాలు...
18-04-2019
Apr 18, 2019, 04:39 IST
ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్‌ బంధన్‌లో స్థానం...
18-04-2019
Apr 18, 2019, 04:29 IST
సాక్షి, అమరావతి: స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రాజకీయ చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి...
18-04-2019
Apr 18, 2019, 04:22 IST
సాక్షి, గుంటూరు: పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు ఆ తప్పును జనంపైకి నెట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన కోడెల...
18-04-2019
Apr 18, 2019, 04:22 IST
హాత్రస్‌.. యూపీలోని ఒక కీలక నియోజకవర్గం. ఈ పేరు వినగానే అందరికీ రంగుల హోలీ పండుగ గుర్తొస్తుంది. యూపీలో హాత్రస్‌...
18-04-2019
Apr 18, 2019, 03:51 IST
బీజేపీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పొన్‌...
18-04-2019
Apr 18, 2019, 03:45 IST
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్‌ 8వ తేదీ వరకు తానే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2014లో...
18-04-2019
Apr 18, 2019, 03:38 IST
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికలను 2014లో కంటే సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగుతుండటం వెనుక ఉన్న శక్తులపై ఎన్నికల...
18-04-2019
Apr 18, 2019, 03:38 IST
రాజస్తాన్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లలో  పలువురు...
18-04-2019
Apr 18, 2019, 03:24 IST
తానా అంటే తందానా అన్నవిధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం..
17-04-2019
Apr 17, 2019, 22:01 IST
లక్నో: ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు ఊపందకున్నాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే 8 లోక్‌సభ స్థానాలకు 85 మంది వివిధ...
17-04-2019
Apr 17, 2019, 21:30 IST
చంద్రబాబు నాయుడు ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ సీఎం. ఇప్పుడు కాదు.. ఇక ఎప్పటికీ కారు.
17-04-2019
Apr 17, 2019, 19:39 IST
లక్నో : వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసే విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు భీమ్‌ ఆర్మీ చీఫ్‌...
17-04-2019
Apr 17, 2019, 19:32 IST
ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దని..
17-04-2019
Apr 17, 2019, 19:23 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top