‘కృష్ణయ్య బీసీ గర్జనకు వెళితే నీకేంటి?’

BC Associations Leaders Slams V Hanumantha Rao - Sakshi

హైదరాబాద్‌: బీసీ డిమాండ్ల సాధనకు, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన బీసీ గర్జన సభకు తమ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య వెళితే మీకు వచ్చిన నొప్పేంటని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావును 14 బీసీ సంఘాల నేతలు ప్రశ్నించారు. బీసీల సమస్యలు, డిమాండ్లు కృష్ణయ్యకు తెలుసు కాబట్టే జగన్‌ ముఖ్య అతిథిగా పిలిచారన్నారు.

గర్జన సభకు కృష్ణయ్య వెళ్లడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని నిలదీశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. బీసీల నేతగా ఎదిగిన కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ సభకు వెళ్లితే కృష్ణయ్యను తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని వీహెచ్‌ని ప్రశ్నించారు. అంతకుముందు బీసీ సంఘాల నేతలంతా చీపుర్లు పట్టుకుని వీహెచ్‌కి తగిన గుణపాఠం చెబుతామంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు నీరడి భూపేష్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top