‘ఆయనకి కళ్ళు దొబ్బాయేమో.. చెక్‌ చేసుకోవాలి’

Bandi sanjay Kumar Controversial Comments On Gangula Kamalakar - Sakshi

సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్‌ బండారం త్వరలోనే బయటపెడతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ హెచ్చరించారు. మంత్రి గంగుల కమలాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్‌ తన విషయంలో గంగుల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ‘కరోనా సమయంలో నేను కనపడలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయనకి కళ్ళు దొబ్బాయేమో, ఒకసారి చెక్‌ చేసుకోవాలి’  అని ఎద్దేవా చేశారు. (కొండపోచమ్మ: సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీ )

కరోనా నేపథ్యంలో తాను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీఈ కిట్లు ఇచ్చానని.. మంత్రి ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లకి తిరిగానని, మంత్రిగా గంగుల కమలాకర్ రాష్ట్రంలో ఎక్కడ తిరిగాడో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గంగుల కమలాకర్ ఏం చేశాడని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌కు సంస్కారం లేదని, అనాలోచితంగా తనపై వాగుతున్నాడని విమర్శించారు. (వారంలో ఏడు కిలోల బరువు తగ్గాలంటే..)

‘నా స్థాయి నుంచి కిందకి దిగి గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతున్నా. నేను సంస్కారంగా మాట్లాడితే అసహ్యంగా మాట్లాడుతున్నారు. గంగుల కమలాకర్ బండారం త్వరలోనే బయటపెడతా. చాటింగ్‌లు ఉన్నాయ్. అవి డైరెక్ట్ గా మీ సీఎంకే పంపిస్తా. లాక్‌డౌన్‌ కాబట్టి కొన్ని జీవితాలకు ఇబ్బంది అవుతుంది అని బయటపెట్టలేదు. త్వరలోనే అవన్నీ బయటపెడతా. సరైన సమయం వస్తే అప్పుడు అన్ని తెలుస్తాయి. మంత్రి గంగుల కమలాకర్ జాగ్రత్తగా ఉండాలి. కరీంనగర్ అభివృద్ధిలో కలిసి ముందుకు వెళదాం అని గంగులకి చెప్తున్నా. తమ్ముడిగా నన్ను భావించి ముందుకు కరీంనగర్ అభివృద్ధి వెళదాం. కానీ అనవసర రాజకీయాలు చేయడం సరికాదు. (‘పరోటాతో దేశం ముందు మరో సవాల్‌’ )

హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు లక్ష్మణ్, రాంచందర్ రావు అరెస్ట్‌ను ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి ఆపాయింట్‌మెంట్ ఇవ్వరు. వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు. ఇదో దివాలాకోరు ప్రభుత్వం. తెలంగాణలో జర్నలిస్ట్ మనోజ్.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే చనిపోయారు. జర్నలిస్ట్‌లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. టెస్టులు ఎక్కువగా చేయకుండా ప్రభుత్వం తప్పు చేస్తోంది’. అని ప్రభుత్వం, గంగుల కమాలకర్‌పై ఎంపీ బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top