సాక్షి,హైదరాబాద్: బోరబండకు నేనొస్తున్నా..ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాలు విసిరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ గురువారం బోరబండలో బహిరంగ సమావేశం నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి కోరారు.
బండి సంజయ్ విజ్ఞప్తిపై పోలీస్ శాఖ బహిరంగ నిర్వహించేందుకు ముందు అనుమతి ఇచ్చింది. తొలుత అనుమతిచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. బహిరంగ సమావేశం నిర్వహించేందుకు పోలీసులు అనుమతి రద్దు చేయడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇచ్చి ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండకు నేనొస్తున్నా.ఎవరు అడ్డుకుంటారో చూస్తా. ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడింది. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా.. సాయంత్రం బొరబండకు తరలిరండి’ అంటూ పిలుపునిచ్చారు.


