ఉత్సాహంగా పోలింగ్‌

65 Point 61 Persentage Polling Recorded in the Third Phase of Lok Sabha - Sakshi

లోక్‌సభ మూడో విడతలో65.61% పోలింగ్‌ నమోదు 

అస్సాంలో అత్యధికం..అనంత్‌నాగ్‌లో అత్యల్పం 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం 117 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో రాత్రి 8 గంటల వరకు 65.61% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ)తెలిపింది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ మినహాయిస్తే మూడు దశల్లో ఇప్పటి వరకు 302 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగినట్లయింది. రెండో విడతలో వాయిదా పడిన త్రిపుర (తూర్పు) నియోజకవర్గం పోలింగ్‌ కూడా మంగళవారం జరిగింది. మూడో విడతతో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలతోపాటు ఉత్తరాదిన గుజరాత్‌లో పోలింగ్‌ ముగిసినట్లయింది.

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌లో 79.77శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ విడతలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్, ఎస్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశ్చిమబెంగాల్, కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల హింసలో ఇద్దరు చనిపోయారు. ఈ విడతలో 2.81 లక్షల బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించగా, వివిధ లోపాలు తలెత్తడంతో 1593 యూనిట్లను మార్చామని ఈసీ తెలిపింది. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి.  

అనంత్‌నాగ్‌లో అత్యల్పం.. 
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికలో అత్యల్పంగా 13.61% (2014లో 39.37%) ఓటింగ్‌ నమోదైంది. ఈ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం పోలింగ్‌ విధులు ముగించుకుని వస్తున్న ఐటీబీపీ జవాన్ల వాహనంపై కోకర్‌నాగ్‌ ప్రాంతంలో అల్లరి మూక రాళ్లు రువ్వగా అది బోల్తా పడటంతో ఆ వాహనం డ్రైవర్‌ చనిపోయారు. 

బెంగాల్, యూపీల్లో.. 
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ నియోజకవర్గం భగ్వాన్‌గోలా సమీపంలోని బలిగ్రామ్‌లో ఓటేయడానికి వెళ్లిన తియారుల్‌ షేక్‌ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. తమ కార్యకర్త తియారుల్‌ను టీఎంసీ వాళ్లే చంపారని ముర్షిదాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని అబు హెనా ఆరోపించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఈసీ ఆదేశించింది. బాలుర్ఘాట్‌ నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ బూత్‌ బయట రెండు వర్గాల వారు పరస్పరం బాంబులు విసురుకున్నారు. జంగిపూర్‌లో గుంపును చెదరగొట్టేందుకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు లాఠీచార్జి చేశాయి. త్రిపురలో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా ఓట్లేయిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈటాలోని ప్రిసైడింగ్‌ అధికారిని విధుల నుంచి తప్పించారు.

పోలింగ్‌ శాతాలిలా.. 
గుజరాత్‌ (26)లో 63.67% పోలింగ్‌ నమోదైంది. యూపీ(10)లో 61.35%, కేరళ(20)లో 76.82%, కర్ణాటక(14)లో 67.56%, మహారాష్ట్ర(14)లో 57.01%, గోవా(2)లో 73.23%, ఛత్తీస్‌గఢ్‌(7)లో 64.68%, పశ్చిమబెంగాల్‌(5)లో 79.67%, ఒడిశా(6)లో 61%, అస్సాం(4)లో 80.73%, బిహార్‌(5)లో 59.97%, త్రిపుర(1)లో 79.57% పోలింగ్‌ నమోదైంది. వీటితోపాటు దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్‌ల్లోని ఒక్కో సీటు కూడా పోలింగ్‌ జరిగింది.

మరిన్ని వార్తలు

19-05-2019
May 19, 2019, 11:59 IST
సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని...
19-05-2019
May 19, 2019, 11:34 IST
‘మా పార్టీకి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. మీరు ఏ పార్టీకి ఓటు వేశారో.. తెలిసిపోతుంది. రేపటి...
19-05-2019
May 19, 2019, 11:07 IST
సాక్షి, తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ సందర్భంగా తొలిసారి దళితులు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎమ్మెల్యే...
19-05-2019
May 19, 2019, 10:40 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్‌...
19-05-2019
May 19, 2019, 10:13 IST
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్‌ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. మరోవైపు బరిలో...
19-05-2019
May 19, 2019, 09:06 IST
సాక్షి, ఒంగోలు: కౌంటింగ్‌ గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా...
19-05-2019
May 19, 2019, 08:50 IST
సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్‌చంద్‌ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. స్థానిక...
19-05-2019
May 19, 2019, 08:18 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు....
19-05-2019
May 19, 2019, 07:13 IST
సార్వత్రిక ఎన్నికలు ఇంత సుదీర్ఘ కాలం నిర్వహించడం సరికాదని అన్నారు. ఎన్నికల దశల్లో రోజుల వ్యవధి ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
19-05-2019
May 19, 2019, 06:53 IST
కష్టాలు ఎదుర్కొన్నా.. అర్ధాకలితో అలమటించా.. మా కుటుంబానికి నాన్న చెప్పిన మాటే వేదం అనుకున్నదానికంటే ముందే రాజకీయ అరంగేట్రం చేశా ప్రజలతో మమేకమయ్యే అవకాశం...
19-05-2019
May 19, 2019, 06:50 IST
చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం ఉదయం 7 గంటలకు రీపోలింగ్‌ మొదలైంది.
19-05-2019
May 19, 2019, 05:20 IST
స్వతంత్ర భారత తొలి ఓటర్‌ శ్యామ్‌శరణ్‌ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి...
19-05-2019
May 19, 2019, 05:16 IST
కేదార్‌నాథ్‌(ఉత్తరాఖండ్‌): హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు...
19-05-2019
May 19, 2019, 05:10 IST
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ప్రధాని మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడంపై...
19-05-2019
May 19, 2019, 05:01 IST
న్యూఢిల్లీ: బీజేపీ తనను చంపాలను కుంటోందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లే వ్యక్తిగత రక్షణ సిబ్బందే తనను హత్య చేయవచ్చని...
19-05-2019
May 19, 2019, 04:57 IST
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి...
19-05-2019
May 19, 2019, 04:49 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో...
19-05-2019
May 19, 2019, 04:18 IST
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ పెంపుడు చిలుక మళ్లీ పలికింది. స్వామికార్యంతోపాటు స్వకార్యం సాధించుకోవడానికి హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి...
19-05-2019
May 19, 2019, 03:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్‌ జరిగిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తాము ఫిర్యాదు...
19-05-2019
May 19, 2019, 03:40 IST
సాక్షి, తిరుపతి: పాతికేళ్ల పోరాటం ఫలిస్తుందా? చిత్తూరు పెత్తందారులు నేడైనా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోనిస్తారా? టీడీపీ నేతల రిగ్గింగ్, అక్రమాలపై...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top