రూ. 3000 నిరుద్యోగ భృతి : ఉత్తమ్‌ | 3000 unemployment allowance: Uttam | Sakshi
Sakshi News home page

రూ. 3000 నిరుద్యోగ భృతి : ఉత్తమ్‌

Apr 17 2018 8:28 PM | Updated on Sep 19 2019 8:44 PM

3000 unemployment allowance: Uttam - Sakshi

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, మణుగూరు : తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతినిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హామీయిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. వరి మొక్క జొన్నలు, సజ్జలు,  రెండువేల రూపాయల మద్ధతు ధర ఇస్తామన్నారు.

పత్తికి రూ. 6000, మిర్చికి రూ. 10 వేలకు పైగా మద్దతు ధరను కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement