మంటల్లో వోల్వో బస్సు | Volvo bus catches fire in Mahabubnagar District | Sakshi
Sakshi News home page

మంటల్లో వోల్వో బస్సు

Oct 30 2013 9:16 PM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయల్దేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాలి. ఇంకో రెండు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొత్తకోట  మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సమీపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది.

ఈ రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు.  బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
49 మంది ప్రయాణీకులున్న ఈ బస్సులో కేవలం ఐదురుగు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.  ప్రమాద సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండటంతో అగ్నికి ఆహూతి అయ్యారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు.బస్సులో మృతిచెందిన  ప్రయాణికుల వస్తువులను పరిశీలిస్తున్న పోలీసులు ప్రమాదానికి గురైన వోల్వో బస్సును పరిశీలిస్తున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement