సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ మండలం చౌట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.
మెదక్: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ మండలం చౌట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మిద్దింటి ముత్యం(45) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. గ్రామానికి చెందిన చాకలి లింగం కూడా సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుండడంతో శుక్రవారం ఉదయం ఊరంతా షాక్ వచ్చింది.