బంగారు తెలంగాణ కోసం కలగన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అప్పుడు అంతా సంతోషించారు.
బంగారు తెలంగాణ కోసం కలగన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అప్పుడు అంతా సంతోషించారు. తరువాత అర్థమైంది. నిజానికి ఆయన బంగారు తెలంగాణకు అసలు అర్థం వేరు. ‘కె’ అంటే కవిత, ‘సి’ అంటే చంద్రశేఖ రరావు, ‘ఆర్’ అంటే రామారావు. బంగారు తెలంగాణకు ఇవే సంకేతాక్షరాల య్యాయి. ఆయన పాలనంతా నియంతృత్వమే. ఏ ఒక్క మంత్రికీ స్వేచ్ఛ లేదు. ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఇక మహిళా సాధి కారత అనే మాటకు కేసీఆర్ రాజ్యంలో సార్థకత ఎక్కడ ఉంది? సమగ్ర సర్వే అన్నారు. అది కూడా సగం సగమే.
మన ఊరు మన ప్రణాళిక అన్నారు. ఏమీ ఒరగలేదు. మిషన్ కాకతీయ అన్నారు. కమీషన్లు కార్యకర్తల కర్త వ్యంగా మార్చేశారు. ఆహార భద్రత కార్డులని చెప్పారు. హరితహారం అన్నారు. ఇదంతా హంగామాగా మిగిలిపోతోంది. కల్యాణలక్ష్మి పథకం అన్నారు. బంగారుతల్లులను మరచిపోయారు. ఆసరా పథకం అంటూనే అసలుకే ఎసరు పెట్టారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లన్నారు. వాటి చిరునామాయే లేదు. రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. వారికి అదీ ఒరగలేదు. సరి కదా, కార్పొరేట్లకు రాయితీలు కురిపిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, హోం గార్డులకు, ఔట్‌సోర్సింగ్ వారికి వేతనాలు లేవన్నారు. జెడ్పీ చైర్మన్‌ల జీతాలు మాత్రం లక్ష రూపాయలు చేశారు. ఇదంతా చూస్తే బంగారు తెలంగాణ అం టేనే భయపడే రీతిలో ఉంది. కాబట్టి కొత్త రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దితే అదే పదివేలు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే గుర్తించాలి.
మలపరాజు అనిత బమ్మెర, వరంగల్ జిల్లా