నిరుపేద భారతం | Poverty in india | Sakshi
Sakshi News home page

నిరుపేద భారతం

Feb 9 2015 1:53 AM | Updated on Sep 2 2017 9:00 PM

భారత దేశంలో ఇప్పటికీ ఇంత మంది నిరుపేదలా? ఆశ్చర్యపడవలసిందేమీలేదు.

భారత దేశంలో ఇప్పటికీ ఇంత మంది నిరుపేదలా? ఆశ్చర్యపడవలసిందేమీలేదు. ఇవి ఎవరో చెప్పిన లెక్కలు కావు.   సాక్షా త్తూ ఐక్యరాజ్య సమితే స్వయంగా ఈ విషయాన్ని పేర్కొంది. మన దేశంలో కనీస వసతులు లేని వారు నేటికీ 30 కోట్ల మంది ఉన్నారంటే దారుణం. ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుపేదల గురించి అవి చేస్తాం ఇవి చేస్తాం అని ప్రణాళికలు రూపొందించడం, అవి అలాగే మిగిలిపోవడం తప్ప కార్యరూపం మాత్రం దాల్చకపోవడం దురదృష్టకరం! ఇన్ని కోట్ల మంది ప్రజలు కనీసం మంచినీరు, కనీస విద్య, సరైన వైద్య వసతికి కూడా నోచుకోని దుస్థితిలో ఉన్నారంటే ఇక మన భారతావని అభివృద్ధి గూర్చి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. స్వచ్చ భారత్ కాదు గరీబ్ హటావో అనే ఉద్యమం మొదలు పెట్టాలి. కానీ మన పాలకులకు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం చీమైనా కుట్టినట్టు ఉండదు. వాళ్ల సుఖాలు వాళ్లు చూసుకుంటారు వాళ్లకు నిరుపేదల గురించి అలోచించే వ్యవధి ఎక్కడిది? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోడానికే సమయం సరిపోవటం లేదు. సరిగ్గా ఇదే మాట మన సర్వోత్తమ న్యాయస్థానం (సుప్రీం కోర్టు) కూడా  వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దేశాన్ని బాగు చేయడం దేముడి తరం కూడా కాదేమో!
 
 - శొంఠి  విశ్వనాధం  చిక్కడపల్లి, హైదరాబాద్
 

Advertisement
 
Advertisement
Advertisement