ఇటీవల కొలీజియం వ్యవస్థ స్థానంలో భారత అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు...
ఇటీవల కొలీజియం వ్యవస్థ స్థానంలో భారత అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ సంస్థ ఎన్‌జేఏసీను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసి మునుపటి కొలీజియం వ్యవస్థకే ఆమోదముద్ర వేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో బడుగు బలహీన వర్గాలకు మరోసారి అన్యాయం జరిగే ప్రమాదం ఏర్ప డింది. కొలీజియం వ్యవస్థ సూచించిన న్యాయమూర్తులనే నియమించాలి, వారు అనుకున్న వారిని మాత్రమే బదిలీ చేయాలి అనే విధాన ప్రజాస్వామ్య వ్యవస్థకే వ్యతిరేకం. దీన్ని రూపమాపడానికే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను రద్దుచేసి దాని స్థానంలో భారత న్యాయ నియామకాల కమిషన్‌ని తీసుకువచ్చింది.
కేంద్రం ఈ నూతన సంస్థను ప్రతిపాదించాక దేశంలో బలహీనవర్గాల ప్రజలు, న్యాయనిపుణులు సంబరపడిపోయారు. ఎందుకంటే మన న్యాయస్థానాల్లో నిమ్న జాతులవారు కొసమెరుపుకు కూడా కనిపించరు. వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాల్లో, సుప్రీంకోర్టుల న్యాయమూర్తులు సంపన్నవర్గాలకు చెందిన వారే. ప్రభుత్వం నుంచే జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి న్యాయమూర్తులను కూడా శిక్షల పరిధిలోకి తీసుకువచ్చే నూతన న్యాయ నియామకాల వ్యవస్థను తీసుకు రావాలి. దళిత, బలహీన వర్గాలకు న్యాయవ్యవస్థలో నేటికీ తగు స్థానం లేకపో వడం గమనార్హం. ‘సుప్రీం’ తీర్పుతో సంబంధం లేకుండా కేంద్రం వీరికీ స్థానం దక్కేలా మరో కొత్త వ్యవస్థను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది.
- కోదాటి శ్యామసుందర్ హైదరాబాద్. మొైబైల్: 9949505780