
కనెక్టికట్(అమెరికా) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ అమెరికా కమిటీ సభ్యులు గురువారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కనెక్టికట్ స్టేట్ హిందూ దేవాలయంలో వైఎస్ జగన్ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించామని కమిటీ కన్వీనర్ రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కూడా హాజరైనట్లు వెల్లడించారు.