అట్లాంటాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

YSR Birthday Celebrations Were Held In Atlanta - Sakshi

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జూలై 11న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ హయాంలో జరిగిన సంక్షేమ పథకాల అమలు, ప్రజలు పొందిన లబ్ధి.. నేడు జగనన్న పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి చర్చించారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువులు చదివి, అట్లాంటాలో ఉంటున్న కొంతమంది ఆయనను స్మరించుకుంటూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు.  (మేరీ ల్యాండ్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు)

మరికొంత మంది వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన హయాంలో చేకూరిన లబ్ధి, ప్రజాసంక్షేమ ఫలాల గురించి ప్రసంగించారు. కాగా నేడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో తండ్రి బాటలోనే పయనిస్తూ రాజన్న పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఇటువంటి కష్టకాలంలో కూడా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందిస్తూ సంక్షేమ రాజ్యం దిశగా దూసుకుపోతోందని ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీని కొట్లూరి, వెంకటరామి రెడ్డి, గోపీనాథ్ రెడ్డి నంద, భూపాల్ రెడ్డి, కృష్ణ కొనకొండ్ల, మహతి, లక్ష్మీనారాయణ, వెంకట్ మీసాల, బాల, సంతోష్, వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు. (వాషింగ్టన్‌ డి.సిలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top