నాట్స్ క్రికెట్ టోర్నీకి అనూహ‍్య స్పందన 

Unprecedented Response To A Cricket Tournament Under NATS - Sakshi

సెయింట్ లూయిస్‌ : అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా సెయింట్ లూయిస్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.సెయింట్ లూయిస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొని తమ సత్తా చాటేందుకు ప్రయత్నించారు. ఈ మెగా క్రికెట్ టోర్నీలో 15 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌లో వల్కన్స్ టీమ్‌, బ్లూ పాంతర్స్ టీమ్‌లు తలపడ్డాయి.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీలో వల్కన్స్ టీమ్‌ విజేతగా నిలవగా, బ్లూ పాంతర్స్ రన్నరప్‌గా నిలిచింది. వల్కన్స్ టీమ్‌కు చెందిన విశాల్‌కు మ్యాన్ ఆఫ​ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బ్లూ పాంతర్స్‌కు చెందిన వెంకటేష్‌ ఉత్తమ బ్యాట్‌మెన్‌గా, వల్కన్స్ టీమ్‌కు చెందిన మహేశ్ బెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యారు.

ఈ టోర్నమెంట్ సెయింట్ లూయిస్ చాప్టర్ నాట్స్ సమన్వయకర్త నాగ శ్రీనివాస శిష్ట్ల, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది. కాగా.. ఈ మెగా టోర్నీకి శ్రీధర్ పాటిబండ్ల, ప్రీతమ్ తమవంతు సహాయ సహకారాలు అందించారు. వ్యాపారవేత్త విజయ్ బుడ్డి, టీఏఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, అప్పల నాయుడు, శిష్ట్ల నాగశ్రీనివాస్, రమేశ్ బెల్లం విజేతలకు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బహుమతులు అందించారు. టోర్నమెంటుకు నాట్స్ జాతీయ నాయకత్వం నుంచి మద్దతు అందించిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్  మంచికలపూడికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top