టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సాహిత్య సదస్సు | Telugu Literary Conference Program Has made By TANTEX In Texas | Sakshi
Sakshi News home page

టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సాహిత్య సదస్సు

Oct 5 2019 12:53 PM | Updated on Oct 5 2019 1:02 PM

Telugu Literary Conference Program Has made By TANTEX In Texas - Sakshi

డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్‌) ఆధ్వర్యంలో 146వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు, 43 వ టెక్సాస్ సాహిత్య సదస్సు అర్వింగ్ పట్టణంలోని కూచిపూడి ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి టెక్సస్‌లోని డల్లాస్‌‌, హ్యూస్టన్, ఆస్టిన్, సానాంటోనియో, టెంపుల్ నగరాల నుంచి వందల మంది సాహితీ ప్రియులు హాజరై స్వీయకవితలు, వ్యాసాలు, పద్యాలు, తెలుగు సిరిసంపదలు విని ఆనందించారు.

సత్యం మందపాటి 'పేరులో ఏముంది', నందివాడ భీమరావు 'సాహిత్యంలో ధిక్కారం' అనే అంశాల మీద మాట్లాడారు. 'పరీక్ష సమీక్ష' అనే అంశం మీద డాక్టర్ చింతపల్లి గిరిజా శంకర్‌ మాట్లాడగా, తెలుగు సిరిసంపదల గురించి డాక్టర్ నరసింహారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సురేష్‌ కాజా, చంద్రహాస్‌ మద్దుకూరి గుర్రం జాషువా, జాలాది వంటి ఆధునిక కవుల గురించి పేర్కొన్నారు. చివరగా సాహితీ సింధూర చిన్నారుల పాటతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన సత్యం, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, కార్యవర్గ సభ్యుడు సతీష్, పూర్వాధ్యక్షులు డా ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, ప్రసాద్ తోటకూర, మాజీ అధినేత చంద్ర కన్నెగంటి, డా.శ్రీనివాసుల రెడ్డి ఆళ్ళ, పాలకమండలి మాజీ అధినేత రామకృష్ణా రెడ్డి దంపతులు,   అనంత్ మల్లవరపు,  రమణ జువ్వాడి, శ్రీకుమార్ గోమటం, శిరీష గోమటం, సుమ పోకల, సి యస్ రావు, ఆర్ కె పండిటి, నందివాడ ఉదయ భాస్కర్, కిరణ్మయి వేముల, పాలకమండలి సభ్యులు, తదితరులు హాజరయ్యారు.

1
1/10

2
2/10

3
3/10

4
4/10

5
5/10

6
6/10

7
7/10

8
8/10

9
9/10

10
10/10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement