
సిడ్నీ : భారత సంతతికి చెందిన లివింగ్‌స్టన్ చెట్టిపల్లి ఆస్ట్రేలియాలో జరగబోయే ఫెడరల్ ఎన్నికల్లో చిఫ్లే నుంచి లిబరల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన లివింగ్‌స్టన్ ఆస్ట్రేలియాలోని డూన్‌సైడ్‌లో భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. లివింగ్‌స్టన్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని మిషనరీ స్కూల్‌లో ఉపాధ్యాయులగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సేఫ్‌మ్యాఫ్ ఐఎన్‌సీలో సీఈఓగా పనిచేస్తున్నారు. గతంలో కమ్యూనిటీ రీసోర్స్ నెట్‌వర్క్‌లో ఎగ్జీక్యూటీవ్ ఆఫీసర్‌గా, ఎస్‌ఈఆర్‌పీ ప్రాజెక్టు మేనేజర్‌గా, స్మాల్ అండ్ ఎమర్జింగ్ కమ్యూనిటీస్ వర్కర్‌గా మెట్రో అసిస్ట్‌లో పనిచేశారు. బ్లాక్‌టౌన్ మల్టీకల్చరల్ అడ్వెజరీ కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నారు.