ఘనంగా ‘టాంటెక్స్ నెలనెలా తెలుగువెన్నెల’

tantex celebrates nela nela telugu vennela - Sakshi

డాలస్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు ఆదివారం (డిసెంబర్‌17న) ఘనంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పాల్గొని.. జయప్రదం చేసారు. ప్రవాసంలో నిరాటంకంగా 125 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సదస్సు నిర్వహించటం విశేషం.

కార్యక్రమంలోముందుగా ప్రముఖ సినీ గాయని నూతన, మోహన్‌ ప్రార్థనాగీతం ఆలపించారు. కొరివిచెన్నారెడ్డి కంకటిపాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని ‘అన్నదానఫలమహాత్యం’ పురాణపఠనంచేశారు. పాలపర్తి ఇంద్రాణి125వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగువారి ఉత్తమ జీవనవిధానం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాలపర్తి ఇంద్రాణి రచించిన మూడోకవితాసంకలనం,'ఇంటికొచ్చిన వర్షం'; తల్లీపిల్లల హృద్యమైన సంభాషణలపుస్తకం 'చిట్టిచిట్టిమిరియాలు', మొదటినవలిక 'ఱ'  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ‘సింహావలోకనం’ లో 2017సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్‌ వరకు నెలనెలా జరిగిన సాహిత్యసదస్సులను గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, శీలం కృష్ణవేణి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, కోడూరు కృష్ణారెడ్డి, తెలకపల్లిజయ, కర్రిశశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top