చికాగోలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

TAGC celebrated International Women's day event in Chicago - Sakshi

చికాగో : తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ చికాగో(టీఏజీఏసీ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చికాగోలోని గ్లెన్‌ డేల్‌ లో రమడ ఇన్‌ బాంక్వెట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీస్‌ కాన్సుల్‌ రాజేశ్వరి చంద్రశేఖరన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేశ్వరి చంద్రశేఖరన్‌, కో స్పాన్సర్‌ అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధులు జ్యోతి మాధవరామ్‌, ప్రణిత కందిమళ్లలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టీఏజీఏసీ మహిళ ఫోరం ఛైర్‌పర్సన్ బింధు గంగోటి‌, టీఏజీఏసీ ప్రెసిడెంట్‌ జ్యోతి  చింతలపాణిలు అతిథులను సాధర ఆహ్వానం పలుకుతూ ప్రసంగించారు. చికాగోలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారు.బింధు గంగోటి, కో ఛైర్‌పర్సన్స్‌ నందిని కొండపల్లి, కీర్తి అడ్డుల, శైలజ యెండులూరి, మేఘన లక్కిడి సౌమ్య బొజ్జ, రజిత గోపు, దీప్తి గార్లపాటి, దీప్తి ముత్యం పేట్‌, క్రాంతి దొండ, శ్వేత జనమంచి, హరిత గునుగాటిలు పలు వినోధ కార్యక్రమాలకు రూప కల్పన చేసి అతిథులను ఆహ్లాద వాతావరణంలో గడిపేలా చేశారు. ఆటా, పాటలతో పాటూ వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.  

 

శైలజా మురుగు తన సంగీతంతో అందరిని ఆకట్టుకున్నారు. మమతా శర్మ, గ్రీష్మ వర్గీస్‌లు అతిథులకు విలువైన సూచనలు చేశారు. ప్రముఖ నటి శ్రీదేవి మృతికి సంతాపం తెలిపారు. యూత్‌ వాలంటీర్లు సునైనా గొంగటి, రియా గునుగంటి, సంజనా గొంగటి, రివా లక్కడి, స్మ్రుతి బెర్రమ్‌, లహరి బెర్రం, అమెయా, తాన్వి శ్రీవోల్‌లు చికాగోలోని లా రబిడా పిల్లల ఆసుపత్రికి విరాళాల సేకరణకు తమవంతు సహాయం చేశారు. టీఏజీసీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు మమతా లంకల, విజయ్‌ బెర్రమ్‌, వెంకట్‌ గునుగంటి, శ్వేత జనమంచిలు ఆతిథులను మర్వాదపూర్వకంగా ఆహ్వానించే పనులు చూసుకోగా, వాణి యంత్రింతాల డెకరేషన్‌ పనులను పర్యవేక్షించారు. కో స్పాన్సర్‌ అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షులు సత్య కందిమళ్ల, ఛైర్మన్‌ కరుణాకర్‌ మాధవరం, మిగతా స్పాన్సర్స్‌, బోర్డు మెంబర్స్‌, ఉమా అవదూత, సుజాత కట్ట, మానస లట్టుపల్లి, క్రాంతి బీరం, రుక్మిణి చాడ, వాలంటీర్లకు టీఏజీఏసీ ప్రెసిడెంట్‌ జ్యోతి  చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top