'మే డే'న కార్మికులతో ఎస్‌టీఎస్‌ ఆత్మీయ పలకరింపు

STS members celebrates may day with workers in Singapore - Sakshi

సింగపూర్‌ : శ్రామిక దినోత్సవం మే డే సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌) సభ్యులు కార్మికులతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్‌లో పని చేస్తున్న కార్మికులను ఎస్‌టీఎస్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసింది. ఈ సందర్భంగా కార్మికులకు గిఫ్ట్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమం సెంబవాంగ్, కెన్టెక్, టుఆస్, బుకిట్ బటోక్, మెగాయార్డ్, పెంజూరులో ఉన్న హాస్టల్స్‌లో జరిగింది. కార్మికులకు అండగా ఉండటానికి కార్మికుల సహాయనిధిని అధికారికంగా ప్రారంభించామని ఎస్‌టీఎస్‌ ప్రెసిడెంట్ కోటిరెడ్డి అన్నారు. కార్మిక సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.

సింగపూర్‌లో ఉన్న తెలుగు వారికి ఏదైనా ఆపద కలిగితే తమ కార్యవర్గం సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్‌టీఎస్‌ వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు పది హాస్టళ్లలో ఉన్న కార్మికులను కలిసి గిఫ్ట్ బాటిల్స్ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు, టీమ్ లీడర్స్ కు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top