లండన్‌లో ‘కేసీఆర్‌ కూపన్స్‌’తో విద్యార్థులకు సహాయం

KCR coupons distributed to students in London - Sakshi

లండన్ : తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్‌కు గత ఏడాదిగా ఉన్నత చదువుకోసం వచ్చిన వేలాది మంది విద్యార్థులు కరోనా మహమ్మారి వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే విభాగం ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు.టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ ‘కేసీఆర్‌ కూపన్స్’ పేరుతో సామాజిక దూరాన్ని పాటిస్తూ సుమారు 200లకు పైగా విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారి స్థానిక దుకాణాలల్లో తీసుకునేలా ఏర్పాటు చేశామని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ " కేసీఆర్ కూపన్స్ " పేరుతో భారతీయులకు సహాయం చేస్తున్నామని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ 200కు పైగా విద్యార్థులు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను స్థానిక దుకాణాలలో తీసుకొనేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కూపన్‌ను ఆవిష్కరించి ప్రోత్సహించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ స్ఫూర్తితో, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రవాసులకు సహాయం చేస్తూ వారిలో మానసికస్థైర్యాన్ని నింపుతున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం చెప్పారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే సభ్యులు గత నెల రోజుల నుంచి స్థానికంగానే కాకుండా క్షేత్రస్థాయిలో ఎంతోమందికి నిత్యావసరాలు అందించారని, యూకేలో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారికి ఏదైనా సహాయం కావాలంటే nritrs@gmail.com ద్వారా  సంప్రదించవచ్చని సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. 

దేశమే గర్వించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కరోన మహమ్మారి నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్నారని, ప్రజలు కూడా సహకరించి భౌతికదూరం పాటించాలని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి కోరారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని తెలిపారు. విద్యార్థులకు నిత్యావసరాలను అందించేందుకు సహకరించిన అనిల్ కూర్మాచలం, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, సతీష్ గొట్టెముక్కల, రమేష్ ఈసెంపల్లి, హరి నవాపేట్, సురేష్ గోపతి, శివ గౌడ్, రవి ప్రదీప్ పులుసు, సృజన రెడ్డి చాడ తదితరులకు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top